ఈడెన్ గార్డెన్స్ టెస్టులో టీమిండియా ప్లేయర్ రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చీరాగానే వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఎదుర్కొన్న ఐదో బంతికే సిక్సర్ బాది అత్యధికంగా 91 సిక్సర్లు కొట్టిన భారత ప్లేయర్గా అగ్రస్థానంలో నిలిచాడు. అంతకుమందు ఈ రికార్డ్ సెహ్వాగ్(90) పేరిట ఉండేది. ఈ లిస్టులో రోహిత్(88), జడేజా(80), ధోనీ(78) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.