KDP: జమ్మలమడుగు మండలంలోని అంబవరం ప్రాంతంలో ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల పరిసరాలలో పట్టపగలే నక్కలు సంచరిస్తున్నాయి. పక్కనే అడవి ఉండటంతో అవి రావడానికి సులువైనది. పక్కనే రహదారి, కళాశాల ఉండడంతో ఆప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అధికారులు వాటిని రాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. నక్కల మొహం చూస్తే అదృష్టం వస్తుందని, కొందరు కరుస్తాయని భయపడుతున్నారు.