MDK: శివంపేట మండలం సికింద్లాపూర్ స్వయంభు వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కార్తీకమాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం చివరి శనివారం ఏకాదశి పురస్కరించుకొని స్వామివారికి ప్రాతంకాల సమయంలో పంచామృత అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.