గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న మూవీ ‘పెద్ది’. ఇటీవల ఈ మూవీలోని చికిరి చికిరి పాట రిలీజ్ కాగా మిలియన్ల వ్యూస్‌తో అదరగొడుతోంది. ఈ పాటపై తాజాగా నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ పోస్ట్ పెట్టింది. ‘చికిరి పాట 1.44 మిలియన్లపైగా లైక్స్, 75 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇది విడుదలైనప్పటి నుంచి టాప్ 1లో ట్రెండ్ అవుతోంది’ అని పేర్కొంది.