KMR: మాచారెడ్డి మండలం చుక్కాపూర్లో వీధి కుక్కల స్వైర విహారం రోజురోజుకూ పెరిగిపోతోంది. భయాందోళన సృష్టిస్తున్న ఈ కుక్కలు చిన్నపిల్లలపై దాడులకు తెగబడుతున్నాయి. రెండు రోజుల క్రితం ఓ బాలికపై దాడి జరిగింది. అయినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.