కృష్ణా: వడ్లమన్నాడు గ్రామంలో ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ (SASA) కార్యక్రమం శనివారం నిర్వహించారు. గ్రామంలో బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన, మూత్రవిసర్జన చేయరాదని సర్పంచ్ కటికల జ్యోతిలత తెలిపారు. గ్రామ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి శుభ్రతా చర్యలను చేపట్టాలని గ్రామస్తులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.