కృష్ణా: ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నూతన కమిషనర్గా రంజిత్ బాషా శనివారం బాధ్యతలు చేపట్టారు. గతంలో రంజిత్ బాషా కృష్ణా జిల్లా కలెక్టర్గా, గుడివాడ ఆర్డీవోగా విధులు నిర్వహించారు. గుడివాడ పట్టణంలోని అనేక స్వచ్ఛంద, సేవ సంస్థలు, పలు సామాజిక వర్గాలకు సుపరిచితులు. ఈ సందర్భంగా రంజిత్ బాషాకు గుడివాడ, జిల్లా ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.