KRNL: శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన రాష్ట్రస్థాయి ఎన్జీఎఫ్ అండర్-14 అథ్లెటిక్స్ పోటీల్లో ఎమ్మిగనూరు గుడ్ బ్లెస్ స్కూల్ విద్యార్థి అశ్వర్థ కృష్ణ 200 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం సాధించాడు. డిసెంబర్ 1 నుంచి 3 వరకు మధ్యప్రదేశ్లో జరిగే జాతీయస్థాయి పోటీలకు అతడు అర్హత సాధించాడు. విద్యార్థిని పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు అభినందించారు.