NDL: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం రాత్రి కోటి దీపోత్సవం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆలయ ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులచే ఈ కోటి దీపోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో సాగింది.