VZM: కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలో వియ్యంపేట గ్రామంలో శుక్రవారం రాత్రి ఓ మహిళను చంపి బంగారం దొంగలించిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. దూది రాము(59) ఒంటిమీద ఉన్న రెండు తులాల పుస్తెలతాడు, చెవులకు ఉన్న రింగులను బలవంతంగా తెంపి తలగడతో ముఖంపై గట్టిగా అధిమి చంపినట్లు తెలిపారు. స్థానిక సీఐ షణ్ముఖరావు, సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.