ప్రకాశం: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు కనిగిరిలో పోలీసులు శనివారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో, కందుకూర్ రోడ్డు, పామూరు బస్టాండ్ సెంటర్లో పోలీస్ జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తుల ఐడీలను పరిశీలించారు. వేలిముద్రలను సేకరించారు. సీఐ ఖాజావలి, ఎస్సై శ్రీరామ్ పాల్గొన్నారు.