NLG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మంత్రి ఉత్తమ్ ఎన్నికల సమన్వయకర్తగా వ్యవహరించిన యూసఫ్ గూడ డివిజన్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. ఈ డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి 13,829 ఓట్లు లభించగా, బీఆర్ఎస్ పార్టీకి 8,537 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 5,292 ఓట్ల (దాదాపు 21%) మెజారిటీ లభించింది . మంత్రి వ్యూహరచన ఉత్తమ ఫలితాన్ని ఇచ్చింది అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.