BBCకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. క్యాపిటల్ హిల్‌పై దాడి సందర్భంగా 2021లో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చినట్లు BBCపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ సంస్థపై దావా వేస్తానని ట్రంప్ గతంలో వెల్లడించారు. దీనిపై ఇప్పటికే BBC క్షమాపణలు చెప్పింది. అయితే, 5 బిలియన్ డాలర్ల వరకు దావా తప్పదంటూ ట్రంప్ మరోసారి హెచ్చరించారు.