విమర్శించే హక్కు అందరికీ ఉంటుందని హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపాడు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ప్రేక్షకులే కారణమని, వారి విమర్శలని గౌరవంగా స్వీకరిస్తానని చెప్పాడు. తాను సరిగ్గా నటించకపోతే ప్రతిఒక్కరూ విమర్శించవచ్చని, ప్రేక్షకులను అలరించడానికి 100శాతం ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. ఇటీవల తనను రాజమౌళి ప్రశంసించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని అన్నాడు.