W.G: నరసాపురం మండలం వేముల దేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి శనివారం భారీ సంఖ్యలో భక్తులు విచ్చేశారు. కార్తీక మాసం అలాగే స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో వేకువ జాము నుంచి ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.