2019లో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ విమానం కూలిన ఘటనలో 157 మంది దుర్మరణం పాలయ్యారు. అందులో భారత్‌కు చెందిన శిఖా గార్గ్ కూడా ఒకరు. ఈ ప్రమాదానికి గానూ ఆమె కుటుంబానికి 36 మిలియన్ డాలర్లు (రూ.319cr) చెల్లించాలని ఇటీవల బోయింగ్‌ను అక్కడి కోర్టు ఆదేశించింది. కాగా, ఐక్యరాజ్య సమితిలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలో విమాన ప్రమాదంలో శిఖా మరణించారు.