AP: రాప్తాడులో వస్త్ర పరిశ్రమ రానుందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో రెండోరోజు సీఐఐ పెట్టుబడుల సదస్సులో మాట్లాడిన చంద్రబాబు.. అనంతపురం జిల్లా టేకులోడులో ఏరోస్పేస్ పరిశ్రమ వస్తుందన్నారు. ఈ సీఐఐ సదస్సులో జరిగిన ఒప్పందాలతో 20 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. మరోవైపు ‘ఇన్వెస్టింగ్ ఫ్రమ్ అబ్రాడ్-NRTS ఫర్ వికసిత్ భారత్’పై చంద్రబాబు ఇవాళ సమీక్షించనున్నారు.