ఏలూరు జిల్లా యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జితేంద్ర బాబు తెలిపారు. రెండేళ్ల కాంట్రాక్టుతో ఖతర్‌లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. డిప్లొమా పూర్తి చేసి, వెల్డింగ్‌లో పదేళ్ల అనుభవం ఉన్న 45 ఏళ్లలోపు వారు అర్హులు. ఆసక్తి గలవారు అధికారిక వెబ్సైటులో నమోదు చేసుకోవాలన్నారు.