చిత్తూరు జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని DRO కె.మోహన్ కుమార్ పిలుపునిచ్చారు. ఇవాళ కలెక్టరేట్ ఆవరణలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు.