కృష్ణా: దివిసీమను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దటం అభినందనీయమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. ఇవాళ అవనిగడ్డ వచ్చిన ఆలపాటి రాజా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదుతో కలిసి మోపిదేవి వార్పులోని ఇరిగేషన్ శాఖ గార్డెన్‌ను సందర్శించారు. ఐ లవ్ దివిసీమ బోర్డు వద్ధ ఫోటో దిగారు. ఈ మేరకు దివిసీమ ముఖద్వారాన్ని ఆహ్లాదకరంగా మార్చిన బుద్ధప్రసాద్ కృషిని అభినందించారు.