GNTR: ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఆరంభమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పెద్దలకు వేల ఎకరాలు కట్టబెడుతున్న ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే పరిస్థితిలో లేదని విమర్శించారు. ఆదివారం విజయవాడలో జరిగే సీపీఐ రాష్ట్రస్థాయి సదస్సును జయప్రదం చేయాలన్నారు.