నందమూరి బాలకృష్ణతో బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా ‘అఖండ 2’. తాజాగా మేకర్స్ ఈ సినిమాపై నయా అప్డేట్ ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటలకు బిగ్ రివీల్ ఉన్నట్లు పోస్టర్ షేర్ చేశారు. ఇక 14 రీల్ ప్లస్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది.