MHBD: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో నిర్మించిన బాయ్స్ హాస్టల్‌ను ఎమ్మేల్యే డా. భూక్యా మురళీ నాయక్ ఇవాళ ప్రారంభించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో విద్య, వైద్యంకు పెద్ద పీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వైద్య విద్యార్థులకు ఏ సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకొరావాలన్నారు. కొత్త భవనం ప్రారంభంతో వసతి సమస్యలు తగ్గుతాయని మెడికోలు ఆశాభావం వ్యక్తం చేశారు.