E.G: అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధి పనుల పురోగతి, వసతుల కల్పన గురించి ఏపీఎంఐడీసీ అధికారులతో ఆయన చర్చించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 56 వేల చదరపు అడుగులు భవనాల నిర్మాణం జరుగుతోందన్నారు. అదనపు భవనం ప్రతిపాదన సిద్ధం చేయాలని సూచించారు.