MBNR: మెరుగైన జ్ఞానం సంపాదించడం కోసం విద్యార్థులు గ్రంథాలయాలను సందర్శించడం అలవాటు చేసుకోవాలని మహబూబ్నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నరసింహారెడ్డి అన్నారు. గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఇవాళ జిల్లా గ్రంథాలయంలో చెస్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఛైర్మన్ మాట్లాడుతూ.. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత పదవులు సాధించాలని పేర్కొన్నారు.