HYD: ఆదివాసుల ఆరాధ్య దైవం భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను గాంధీభవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదివాసి కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ బెల్లయ్య నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ఆదివాసుల హక్కులను కాలరాస్తూ చెలగాటమాడుతుందని పేర్కొన్నారు.