TPT: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ తిరుపతి పర్యటనను ముగించుకుని ఇవాళ రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సీజేఐకి జ్ఞాపికను అందించి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో అధికారులు, న్యాయవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు.