SKLM: జలుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో ఇవాళ ఎల్సీడీసీ సర్వేపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వైద్యాధికారిని ఎం. సంధ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు విషయాలను చర్చించారు. ఈనెల 15 నుంచి 30 వరకు ఇంటింటా సర్వే నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఎస్వో చిన్న రాజులు, HV లలితాంబ, చిన్నారావు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.