ADB: అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న ఆధునికరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2023 సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో పథకాన్ని ప్రారంభించారు. రూ.17.80 కోట్లతో ప్రారంభమైన పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడం గమనార్హం. పనులు పూర్తయితే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి.