NLG: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ) కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఈ నెల 16 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. దేవరకొండ మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానామస్)లో ఈ తరగతులు జరుగుతాయని ప్రిన్సిపాల్ డాక్టర్ రమావత్ రవి, కో-ఆర్డినేటర్ డాక్టర్ వీ.మక్కట్ లాల్ తెలిపారు.