రష్యాపై ఉక్రెయిన్ సంచలన ఆరోపణలు చేసింది. మాస్కో 1,20,000 గ్లైడ్ బాంబులు తయారీ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది చివరి నాటికి వాటిని తయారు చేసేందుకు రష్యా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఉక్రెయిన్ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి వెల్లడించారు. ఇందులో లాంగ్ రేంజ్ వెర్షన్ బాంబులు కూడా ఉన్నట్లు తెలిపారు.