అన్నమయ్య: పీలేరు – కల్లూరు మార్గంలో ఇవాళ వేకువజామున అయ్యప్ప స్వాములతో వెళ్తున్న బస్సు, ముందు వెళ్తున్న యాసిడ్ లారీని ఎం.జె.ఆర్ కళాశాల సమీపంలో ఢీకొట్టింది. లారీ నుండి యాసిడ్ నేలపై కారడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. పీలేరు హెడ్ కానిస్టేబుల్ మణి వెంటనే ఫైర్ ఇంజిన్ రప్పించి యాసిడ్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నారు.