జమ్మూకాశ్మీర్లోని నౌగామ్ పోలీస్ స్టేషన్లో పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తుండగా భారీ విస్ఫోటనం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 9 మంది మృతిచెందారు. అయితే, ఈ పేలుడుకు తామే కారణమంటూ జైషే అనుబంధ సంస్థ PAFF ప్రకటన విడుదల చేసింది. దీంతో ఉగ్రకోణంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.