TG: మేడారం మహాజాతర కోసం స్పెషల్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ రెడీ అవుతోంది. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనున్న నేపథ్యంలో.. భక్తులు ఇప్పటి నుంచి మేడారం వెళ్తూ.. ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16 నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ప్రారంభించనుంది. కాగా, ఈ ప్రత్యేక బస్సుల్లోనూ మహాలక్ష్మి పథకం వర్తించనుంది.