AP: జనసేన పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పార్టీ కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ భార్య నాగమణి కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ‘నా జీవితంలో అత్యంత దుఃఖ భరితమైన సమయాల్లో ఇది ఒకటి. నా ప్రతి సాధన వెనుక ఉన్న మౌనమైన బలం ఆమె. ఓం శాంతి’ అని సత్యనారాయణ ట్వీట్లో పేర్కొన్నారు.