WNP: గోపాల్పేట మండల కేంద్రంలోని కోదండరామస్వామి ఆలయాన్ని 1936లో సంస్థానాధీశురాలైన రాణి రంగనాయకమ్మ నిర్మించారు. ఈ ఆలయంలోని సీతారాముల మూలవిరాట్ విగ్రహాలు దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేని విధంగా ప్రత్యేకంగా ఉంటాయని ప్రధాన అర్చకులు రంగాచార్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇక్కడ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.