అనంతపురంలోని RDT స్టేడియంలో ఈనెల 16 నుంచి జూడో అకాడమీలో జిల్లాస్థాయి జూడో క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అసోసియేషన్ కార్యదర్శి గోవిందు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, క్రీడా సామాగ్రితో హాజరుకావాలన్నారు.