AP: దేవుడిని చంద్రబాబు రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమని మాజీమంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాను నిన్న తిరుపతిలోని వెంగమాంబలో అన్నదానప్రసాదాన్ని స్వీకరించానని తెలిపారు. కానీ తాను ఎవరినీ పొగడలేదని తెలిపారు. అక్కడ అన్నదానం 1985 నుంచి జరుగుతుందని.. ఎప్పటిలాగానే బాగుందని చెప్పానన్నారు. దానికే ఆయనను పొగిడినట్లు సొంత ఛానెల్లో వేసుకుంటున్నారని అన్నారు.