SRPT: పోక్సో చట్టం, జువెనైల్ జస్టిస్ చట్టం పిల్లల రక్షణకు బలమైన, ప్రగతిశీల సాధనాలని హుజూర్ నగర్ జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం హుజూర్ నగర్ పట్టణంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మైనర్ బాల, బాలికల చేత వెట్టి చాకిరి చేయించడం చట్టరీత్యా నేరం అన్నారు.