SRCL: దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధికై విస్తరణ పనులు నేపథ్యంలో పాత భవనాలు కూల్చివేసిన శిథిలాల తొలగింపు పనులు వేగవంతమయ్యాయి. విస్తరణ పనుల కారణంగా ఆలయంలో స్వామి వారికి భక్తుల దర్శనాలు నిలిపి వేసి వేద పండితులచే స్వామివారికి యథావిధిగా చతుష్కాల పూజలు కొనసాగుతున్నాయి.