NLR: ఉదయగిరి మండలం, వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని అదృశ్యంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద విద్యార్థిని గుర్తించి ఉదయగిరి స్టేషన్కు చేరుకున్నట్లు తెలిపారు. శుక్రవారం ఎస్సై ఇంద్రసేనారెడ్డి ఈ ఏర్పాటు చేసి విద్యార్థిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.