ప్రకాశం: కనిగిరిలోని అమరావతి గ్రౌండ్లో శనివారం వృద్ధులకు నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వృద్ధుల వద్దకు వెళ్లీ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి అవసరమైన కళ్ళజోళ్లను ఎమ్మెల్యే స్వయంగా పంపిణీ చేశారు.