దేశవ్యాప్తంగా 8 అగ్రనగరాల్లోనే ఎక్కువగా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ స్థిరాస్తి రంగం విస్తరిస్తుందని సీఐఐ నివేదిక చెబుతోంది. 2047 నాటికి రియాల్టీ పరంగా కొత్తగా అభివృద్ధి చెందే 17 నగరాలను గుర్తించింది. ఇందులో ఏపీకి చెందిన తిరుపతి, విశాఖపట్నం చోటు దక్కించుకున్నాయి.