ATP: గుత్తి కోటలోని అతి పురాతనమైన శ్రీ నగరేశ్వర స్వామి శివాలయంలో కార్తీక మాసం మూడో శనివారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు వేకువజామున పంచామృతంతో శివలింగానికి అభిషేకం చేసి, బిల్వదళాలతో ప్రత్యేక పూజలు చేశారు. భక్తాదులు ఆలయావరణంలో కార్తీకమాసా దీపాలు వెలిగించి, మొక్కుబడులు చెల్లించుకున్నారు.