W.G: స్వాతంత్ర విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటం కులం కోసం కాదని, దేశ ప్రజల స్వేచ్ఛ కోసమని ఉమ్మడి జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు ద్వారంపూడి వేణు గోపాల కృష్ణారెడ్డి అన్నారు. పెనుమంట్ర మండలం మార్టేరులో రేపు ఆదివారం ఉదయం 11 గంటలకు ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారన్నారు.