ప్రకాశం: స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కనిగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు హ్యాండ్ వాష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొని విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ చేతులను దూరంగా కడుక్కోవాలని, పరిశుభ్రతగా ఉంటే వ్యాధులు దరిచేరమని సూచించారు.