MBNR: జిల్లా మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థి రజనీకాంత్ రెడ్డి 2025-26 సంవత్సరానికి గాను 10వ తరగతి చదువుతున్న 27 మంది పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజును చెల్లించి తన ఉదార గుణాన్ని చాటుకున్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు ఫీజులు కడుతున్నానన్నారు.