TG: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు వెళ్లనున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నట్లు సమాచారం. అలాగే ఓ ప్రైవేట్ కార్యక్రమంలోనూ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.