PDPL: బుగ్గారం మండలంలోని సిరికొండలో రైస్ మిల్లును రెవిన్యూ అదనపు కలెక్టర్ బీఎస్ లత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్లు, బ్యాంక్ గ్యారంటీలను త్వరగా అందించాలని మిల్లర్ యజమానులను ఆమె ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన లారీలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెంటనే అన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.