NZB: బోధన్ TG SWREIS గురుకుల విద్యాలయానికి చెందిన జంగం రవివర్మ, ఎంబీ శివకుమార్ కామారెడ్డి – నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల చదరంగపు పోటీలలో విజయం సాధించారు. 17 ఏళ్ల లోపు విభాగంలో రవివర్మ ప్రథమ స్థానం, 14 ఏళ్లలోపు విభాగంలో శివకుమార్ తృతీయ స్థానం కైవసం చేసుకుని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.